రామ్ చరణ్ - శంకర్ కాంబోలో సెప్టెంబర్ 8 న మొదలు కాబోతున్న RC15 మూవీ పూజ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరు హాజరవుతుండగా.. బాలీవుడ్ నుండి రణ్వీర్ సింగ్, కోలీవుడ్ నుండి విక్రమ్ హాజరవుతున్నట్లుగా టాక్. ఈ ఓపెనింగ్ సెర్మనీ ఓ రేంజ్ లో నిర్వహించబోతున్నారని.. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి చాలామంది ప్రముఖులు హాజరవుతారని.. ఆమేరకు దిల్ రాజు నుండి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లుగా సమాచారం.
ఇక ఈ RC15 ముహూర్తపు షాట్ లో హీరోయిన్ కియారా అద్వానీ మెరుపులు మాములుగా ఉండవట. RC15 హీరోయిన్ గా ఎంపికయ్యాక కియారా క్రేజ్ సౌత్ లో బాగా పెరిగింది. భరత్ అనే నేను సో సో గా ఉన్నా.. వినయ విధేయరామ అట్టర్ ప్లాప్ అయినా.. కియారాకి బాలీవుడ్ లో భారీ క్రేజ్ రావడంతో ఇప్పుడు రామ్ చరణ్ తో పాన్ ఇండియా మార్కెట్ లో ఛాన్స్ కొట్టేసింది. దానితో ఆమె రేంజ్ బాగా పెరిగి పారితోషకం కూడా పెంచేసింది అనే న్యూస్ ఉంది. శంకర్ ఆధ్వర్యంలో రామ్ చరణ్ - కియారా అద్వానీలు RC15 కోసం ఫోటో షూట్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చరణ్ - కియారా ట్రయిల్ షూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
RC15 ఓపెనింగ్ లో కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది అని అంటున్నారు.