Advertisementt

పవన్ రేంజ్ మరింతగా ..

Sat 25th Sep 2021 03:50 PM
pawan kalyan,huge remuneration,harish shankar,pspk 28,mytri movie makers  పవన్ రేంజ్ మరింతగా ..
Pawan Kalyan Remuneration For Harish Shankar Movie పవన్ రేంజ్ మరింతగా ..
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవక్కర్లేదు. ఎందుకంటే పవర్ స్టార్ పేరు వింటేనే ఫాన్స్ కి పూనకలొచ్చేస్తాయి. అంతెందుకు పవన్ కళ్యాణ్ మూడేళ్లు వెండితెరకు దూరమై మళ్ళీ సినిమాల్లోకి వచ్చినా.. ఆ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఆ క్రేజ్ చూస్తే దిల్ రాజు పవన్ కి ఏకంగా 50 కోట్ల పారితోషకం ఇచ్చి మరీ వకీల్ సాబ్ కి కమిట్ చేయించాడు. వకీల్ సాబ్ కి పవన్ కళ్యాణ్ అక్షరాలా 50 కోట్ల పారితోషకం అందుకున్నాడు. 

ఇక తాజాగా ఆ ఫిగర్ మరింతగా అంటే మరో పది పెరిగింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్ హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర తో భీమ్లా నాయక్ చేస్తున్నాడు. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ కమర్షియల్ మూవీ చెయ్యబోతున్నాడు. జాతర షురూ అంటూ హారిష్ శంకర్ సినిమాపై క్రేజ్ పెంచేస్తున్నాడు. PSPK 28 షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా పవన్ కళ్యాణ్ కి 60 కోట్ల పారితోషకం ఫిక్స్ చేశారట. మరి వకీల్ సాబ్ తరువాత పవన్ రేంజ్ హరీష్ శంకర్ మూవీ కి వచ్చేసరికి మరో పది కోట్లు పెరిగిపోయింది. ఇప్పుడు ఇదే టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అది పవన్ క్రేజ్ అంటే అంటున్నారు పవన్ ఫాన్స్. 

Pawan Kalyan Remuneration For Harish Shankar Movie:

Pawan Kalyan Huge Remuneration For Harish Shankar Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ