విశాల్ హీరోగా ఆర్య విలన్ గా తెరకెక్కుతున్న ఎనిమి షూటింగ్ కంప్లీట్ అవడము మాత్రామే కాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులని కూడా చాలా స్పీడుగా జరుగుతున్నాయి. విశాల్ - ఆర్య నువ్వా - నేనా అన్నట్టుగా పోటీ పడుతున్న ఈ సినిమాలో అసలైతే ఆర్య - విశాల్ లు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఎనిమీస్ గా మారిపోయి యుద్ధం చేసుకుంటారు. అదే ఈ ఎనిమి స్టోరీ అని ఎనిమి టీజర్ లోనే చూపించేసారు.
ఇక తాజాగా విశాల్ ఎనిమి రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. విశాల్ ఎనిమి మూవీ ని దసరా సెలవల్లో.. నవరాత్రులు ఆయుధ పూజ రోజున అంటే అక్టోబర్ 10 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. విశాల్ అండ్ ఆర్య కర్రోరత్వంగా కనబడుతున్న పోస్టర్ తో సహా ఎనిమి రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. సో విశాల్ ఎనిమి దసరా బరిలో పోటీకి సై అంటుంది అన్నమాట.