Advertisementt

పవన్ కి టీఎస్ గవర్నర్ ప్రశంశలు

Mon 06th Sep 2021 01:31 PM
pawan kalyan,telangana,folk artiste mogulaiah,telangana governor,tamil sai  పవన్ కి టీఎస్ గవర్నర్ ప్రశంశలు
Telangana Governor praises Pawan kalyan పవన్ కి టీఎస్ గవర్నర్ ప్రశంశలు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు అంటూ బిజీగా మారారు. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు చెయ్యాల్సి ఉంది. అందులో ఏకే రీమేక్ భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ మూవీస్ ఒకేసారి పవన్ చెయ్యాలనుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మధ్యన రాయలసీమ ఫోక్ సింగర్ పెంచాల్ దాస్ ని వకీల్ సాబ్ సెట్స్ లో అభినందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు పవన్‌ కల్యాణ్‌ 2 లక్షల ఆర్థిక సాయం చేసారు. 

దానితో పవన్ కళ్యాణ్ ని అందరూ అభినందిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో తెలంగాణ గవర్నర్ తమిళ సాయి కూడా చేరారు. పవన్‌ కల్యాణ్‌ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు 2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అభినందించారు. కళాకారుడికి పవన్‌ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమన్నారు. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం అనేది హర్షణీయమని ఆవిడపేర్కొన్నారు. ఈ విషయంలో పవన్‌ కళ్యాణ్ ను అభినందిస్తూ ఆమె ట్వీట్‌ చేశారు.

Telangana Governor praises Pawan kalyan:

Pawan Kalyan honours Telangana folk artiste Mogulaiah

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ