Advertisementt

సీఎం జగన్‌ తో మంచు మనోజ్‌ భేటీ

Mon 06th Sep 2021 12:49 PM
hero manchu manoj,meeting,cm jagan,ap cm jagan,manoj meets ap cm jagan  సీఎం జగన్‌ తో మంచు మనోజ్‌ భేటీ
Manchu Manoj meets CM Jagan సీఎం జగన్‌ తో మంచు మనోజ్‌ భేటీ
Advertisement
Ads by CJ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఈమధ్యన అంటే మంచు విష్ణు వెరోనికా ని పెళ్లాడిన దగ్గర నుండి తరుచు కలుస్తూ ఉన్న విషయం తెలిసిందే. మంచు విష్ణు భార్య వెరోనికాతో కలిసి జగన్ దంపతులని కలుస్తుండేవారు. అయితే తాజాగా మంచు మనోజ్‌ సోమవారం ఏపీ సీఎం జగన్ ని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..ఈ విషయాన్ని మనోజ్‌ స్వయాన ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

సీఎం జగన్‌ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకున్న దార్శనికతకు ముగ్దుడినయ్యాను. మంచి చేస్తున్న మీలాంటి వ్యక్తికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మీ పరిపాలనకు ఇవే నా శుభాకాంక్షలు.. అంటూ జగన్ ని పొగుడుతూ మంచు మనోజ్ ట్వీట్‌ చేశారు. దానితో మోహన్ బాబు దగ్గర నుండి మంచు విష్ణు వరకు ఏపీ సీఎం జగన్ భజన ఎక్కువైందిగా అంటున్నారు కొందరు. 

Manchu Manoj meets CM Jagan:

Hero Manchu Manoj Meeting With CM Jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ