Advertisementt

తండ్రి కూతుళ్లు రొమాన్స్.. నేను చెయ్యను

Mon 06th Sep 2021 11:22 AM
vijay sethupathi,incident,krithi shetty,labham promotions  తండ్రి కూతుళ్లు రొమాన్స్.. నేను చెయ్యను
Vijay Sethupathi Says He Never Do Such A Role With Krithi Shetty తండ్రి కూతుళ్లు రొమాన్స్.. నేను చెయ్యను
Advertisement
Ads by CJ

తండ్రి కూతుళ్లు రొమాన్స్.. నేను చెయ్యను.. ఈ మాటన్నది ఎవరో కాదు.. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి - శృతి హాసన్ జంటగా నటించిన లాభం సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లాభం ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ సేతుపతి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పెట్టాడు. అదేమిటంటే.. విజయ్ సేతుపతి ఈమధ్యన తెలుగులో ఉప్పెన మూవీలో నటించాడు. ఆ సినిమాలో కొత్త హీరోయిన్ కృతి శెట్టి కి తండ్రిగా రాయనమ్ పాత్రలో ఇరగదీసాడు. తండ్రి కూతుళ్లుగా విజయ్ సేతుపతి - కృతి శెట్టి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

అయితే తాజాగా విజయ్ సేతుపతి ఓ సినిమాలో నటించడానికి రెడీ అయ్యారు. అందులో హీరోయిన్ గా కృతి శెట్టి ని ఎంపిక చేసిన టీం ఆమె ఫోటో ని విజయ్ సేతుపతి పంపగా.. ఈ మధ్యనే ఓ సినిమాలో నేను ఆమెకు తండ్రిగా నటించాను. కూతురు పాత్ర పోషించిన ఆమెతో రొమాన్స్‌ చేయలేను. కాబట్టి ఆమె హీరోయిన్ గా వద్దులే అని చెప్పాడట. అయితే కృతి శెట్టి బేబమ్మగా ఉప్పెన క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కంగారు పడగా.. బేబమ్మ.. నాకు నీ వయసు కొడుకే ఉన్నాడు. నువ్వు నాకు కూతురు లాంటి దానివే. 

ఏం భయపడకు. ఎలాంటి కంగారు లేకుండా ధైర్యంగా చెయ్‌.. అంటూ ఆమెని నా కూతురులా భావించాను. అలాంటిది ఆమెతో రొమాన్స్ చెయ్యడం నా వల్ల కాదు అంటూ నిర్మొహమాటముగా చెప్పడంతో కృతి శెట్టి మాంచి ఛాన్స్ కోల్పోయింది అంటూ ఆమె ఫాన్స్ ఫీలవుతున్నారు. 

Vijay Sethupathi Says He Never Do Such A Role With Krithi Shetty:

Vijay Sethupathi Shares An Unknown Incident About Krithi Shetty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ