నాని తన సినిమా టక్ జగదీశ్ థియేటర్స్ లో రిలీజ్ చెయ్యము.. కరోనా కారణముగా నిర్మాతల ఇష్ట ప్రకారమే మా సినిమాని ఓటిటికి అమ్మెస్తున్నాం అంటూ టక్ జగదీశ్ ని అమెజాన్ ప్రైమ్ నుండి సెప్టెంబర్ 10 వినాయక చవితి స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. టక్ జగదీశ్ ని ఎన్ని ప్రోబ్లెంస్ ని ఫేస్ చేస్తూ ఓటిటి ని కన్ ఫామ్ చేసుకుంది, ఇక ఇప్పుడు వెంకటేష్ దృశ్యం 2 రిలీజ్ ఎప్పుడు అంటున్నారు ఆయన ఫాన్స్. అంటే వెంకీ నారప్ప ని థియేటర్స్ లో కాకుండా ఓటిటిలో రిలీజ్ చేసేసి.. సురేష్ బాబు ప్రస్తుతం కరోనా కారణముగా సినిమాని ఓటిటిలో రిలీజ్ చెయ్యడం బెటర్ అని చెప్పారు.
అలాగే దృశ్యం 2 ని అమెజాన్ ప్రైమ్ కి భారీ లాభాలకు అమ్మేశారని కూడా ప్రచారం జరిగింది. అయితే షూటింగ్ ఫినిష్ అయ్యి ఇన్ని రోజులైనా దృశ్యం 2 రిలీజ్ డేట్ పై స్పష్టత లేదు. అయితే తాజాగా వెంకటేష్, మీనా కాంబో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం 2 మూవీ దసరా స్పెషల్ గా అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్లుగా దృశ్యం 2 ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆసరా టైం కి ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్స్ లో పోటీ పడుతున్న.. అదే పర్ఫెక్ట్ టైం కాబట్టి దృశ్యం 2 ని రిలీజ్ చెయ్యాలి ఫిక్స్ అయ్యారు.