మళ్ళీ కరోనా పంజా దేశం మీద విసురుతుందా అనిపిస్తుంది.. ప్రస్తుతం కరోనా అప్ డేట్ . సెకండ్ వేవ్ తగ్గి. మధ్యలో కాస్త సాధారణ పరిస్థితులు ఏర్పడినా.. మళ్ళీ కరోనా కేసులు 40 వేలకు పైబడి నమోదు కావడం నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న కొత్తగా ఇండియాలో 42,618 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,45,907కి చేరింది. అలాగే, నిన్న 36,385 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 330 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,225కి పెరిగింది.
దేశంలో ఎక్కువ శాతం కేసులు కేరళ లో నమోదు కావడం, మహారాష్ట్రలాంటి రాష్ట్రాల్లో కేసులు పెరగడంతో..ఇండియా కరోనా కేసులు మరోసారి తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,21,00,001 మంది కోలుకున్నారు. 4,05,681 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 67,72,11,205 డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్న వారిలో ఉన్నారు.