Advertisementt

బాలయ్య అఖండ అదిరి అప్ డేట్

Fri 03rd Sep 2021 04:57 PM
balayya,boyapati,balakrishna - boyapati combo,balayya akhanda movie,akhanda movie  బాలయ్య అఖండ అదిరి అప్ డేట్
Crazy update on Balayya Akhanda బాలయ్య అఖండ అదిరి అప్ డేట్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న అఖండ మూవీ పై ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. బాలకృష్ణ - బోయపాటి కాంబో అంటే.. మాస్ ఊర మాస్ అనేలా ఉంటుంది. అదే లెవల్లో అఖండ కూడా తెరకెక్కుతుంది. కరోనా లేకపోతె ఎప్పుడో అఖండ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే. కానీ బాలయ్య ఫాన్స్ ని సెకండ్ వెవ్ అడ్డంగా మోసం చేసింది. ఇక ఈమధ్యనే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో అఖండ ఫైనల్ షెడ్యూల్ అంటే క్లైమాక్స్ షూట్ ని కంప్లీట్ చేసుకుంది. 

ఇక ఒక పాట మినహా షూటింగ్ ఫినిష్ అవడంతో బాలకృష్ణ అఖండ డబ్బింగ్ చెప్పేస్తున్నారు. మరోపక్క బోయపాటి అఖండ పోస్ట్ ప్రొడక్షన్ ని చుట్టేస్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడు అఖండ డేట్ ఇస్తారా అని బాలయ్య నందమూరి ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అఖండ సినిమాని దసరా స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే దసరాకి అఖండ అంటూ అఫీషియల్ అనౌన్సమెంట్ వస్తుందేమో చూద్దాం. 

Crazy update on Balayya Akhanda :

Balakrishna Akhanda update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ