శర్వానంద్, సిద్ధార్ధ్ కలిసి నటిస్తోన్న మహా సముద్రం సినిమాపై అంఛనాలు ఆకాశాన్నంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ ఒక మెమరబుల్ మూవీగా నిలిచేలా టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ చెప్పకే..చెప్పకే పాటను ఈ నెల 6న విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్‌లో హీరోయిన్ అదితిరావు హైదరి స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తోంది.
ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన మాస్ సాంగ్ హే రంభ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రెండవ పాట చెప్పకే ... చెప్పకే ... ఒక బ్రీజీ మరియు స్వీట్-సౌండింగ్ నంబర్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది..
ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.