Advertisementt

ట‌క్ జ‌గ‌దీష్ నుండి ట‌క్ సాంగ్

Fri 03rd Sep 2021 03:39 PM
tuck jagadish movie,tuck song,nani  ట‌క్ జ‌గ‌దీష్ నుండి ట‌క్ సాంగ్
Tuck Song From Nani Tuck Jagadish Out ట‌క్ జ‌గ‌దీష్ నుండి ట‌క్ సాంగ్
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన టక్ జగదీష్ ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి.  నిన్నుకోరి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో  ఈ చిత్రం రూపొందు‌తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలు ప్రేక్షకులని అల‌రిస్తుండగా టీజ‌ర్‌, ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ అందరి ప్రశంసలను గెలుచుకుంది.

ఈ రోజు గోపి సుందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని టక్ పాటను విడుద‌ల‌చేసింది చిత్ర  యూనిట్‌. ఈ సారి ఒక ఇంటెన్స్ నెంబ‌ర్ సాంగ్‌తో మ‌న‌ముందుకు వ‌చ్చారు. ఈ పాటను ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ స్వయంగా పాడ‌డం విశేషం. ఈ పాట యొక్క శైలికి తగ్గ‌ట్టుగా ఆయ‌న వాయిస్ చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంది. ఈ పాట‌లో నాని మాస్‌, యాక్షన్ అవతారంలో క‌నిపించ‌నున్నారు.

అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ట‌క్ జ‌గ‌దీష్ వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్‌10 నుండి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

రీతు వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ  చిత్రంలో ఐశ్వ‌ర్య రాజేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది, నాని సోద‌రుడిగా విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నారు.

Tuck Song From Nani Tuck Jagadish Out:

Tuck Song From Tuck Jagadish Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ