గతంలో డ్రగ్స్ కేసులో టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ లేకపోయినా.. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో రకుల్ పేరు బయటికి రావడం, ఈడీ నోటీసు లు ఇచ్చింది. గత ఏడాది బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బాగా వినిపించింది. అక్కడ ముంబై లో రకుల్ ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరయ్యింది. అయితే తనని ఈ కేసులో మీడియా వేధిస్తుంది అంటూ కోర్టుకి ఎక్కగా.. అప్పట్లో రకుల్ కి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. రకుల్ విషయంలో మీడియా అత్యుత్సాహం వద్దని వరించింది. ఇక తాజాగా మనీలాండరింగ్ కేసులో రకుల్ ప్రీత్ ని ఈడీ సెప్టెంబర్ 6 న విచారించాల్సి ఉండగా,...
రకుల్ తనకి షూటింగ్స్ ఉన్న కారణముగా మీరు చెప్పిన డేట్ లో విచారణకు రాలేనని చెప్పి డేట్ మార్చమనగా రకుల్ రిక్వెస్ట్ ని ఈడీ అధికారులు రిజెక్ట్ చేసారు. అయితే రకుల్ ప్రీత్ ని సెప్టెంబర్ 6 కన్నా ముందే అంటే ఈ రోజు ఈడీ విచారణకు పిలవగా రకుల్.. ఓ గంటన్నర ముందే ఈడీ ఆఫీస్ లో ప్రత్యక్షమయింది. ఉదయం 11 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమవుతుంది. ఈలోపే అంటే 9.30 కె రకుల్ ఈడీ ఆఫీస్ కి వచ్చేసింది. ఈ విచారణలో రకుల్ ఆమె బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. రకుల్ ప్రీత్ వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం.