Advertisementt

షాకింగ్: సిద్దార్ధ్ శుక్లా మృతి

Thu 02nd Sep 2021 11:59 AM
bigg boss 13 winner,sidharth shukla,sidharth dies of heart attack,sidharth shukla passess away  షాకింగ్: సిద్దార్ధ్ శుక్లా మృతి
Shocking: Bigg Boss 13 winner Sidharth Shukla passes away షాకింగ్: సిద్దార్ధ్ శుక్లా మృతి
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్ల సడన్ గా మృతి చెందడం అందరిని షాక్ కి గురి చేసింది. హిందీలో పలు సీరియల్స్ లో హీరో పాత్రలు చేసిన సిద్ధార్థ్ శుక్ల బిగ్ బాస్ 13 విన్నర్ గా నిలిచాడు. సల్మాన్ ఖాన్ నుండి విన్నర్ గా ట్రోపి అందుకున్నాడు. ఆ తర్వాత కెరీర్ లో బిజీగా మారాడు.  మంచి జిమ్ బాడీ ఫిజిక్ తో హీరో కటౌట్ తో బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న సిద్దార్థ్ శుక్ల ఇలా అర్ధాంతరంగా తనువు ఛాలించడం బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. సిద్దార్థ్ మరణవార్త విన్న బాలీవుడ్ ప్రముఖులు షాకవుతున్నారు. 

అయితే సిద్దార్థ్ హార్ట్ ఎటాక్ తో సడన్ గా చనిపోయారని, సిద్దార్ద్ కి హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్ కి తరలించేలోపే ఆయన కన్ను మూసినట్లుగా తెలుస్తుంది. ఇంత చిన్న(40) వయసులో, బ్రైట్ ఫ్యూచర్ ఉన్న సిద్దార్ధ్ మరణం పట్ల బాలీవుడ్ మూగబోయింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు సిద్దార్థ్ మృతికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. 

Shocking: Bigg Boss 13 winner Sidharth Shukla passes away :

Bigg Boss 13 winner Sidharth Shukla dies of heart attack

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ