పవన్ కళ్యాణ్ బర్త్ డే కి సోషల్ మీడియా ని షేక్ చెయ్యాలని ఫాన్స్ డిసైడ్ అయ్యారు. పవన్ ఫాన్స్ గత రెండు రోజులుగా ఆయన లేటెస్ట్ మూవీ బీమ్లా నాయక్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ రోజు నుండే పవన్ ని ట్రెండ్ చేస్తూ పవర్ చూపిస్తున్నారు. పవన్ ఫాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల నుండి విరామం తీసుకుని రాజకీయాలవైపు వెళ్లినా ఆయన ఫ్యానిజం ఇసుమంతైనా తగ్గలేదు. ఇక మళ్ళీ సినిమాల్లోకి కం బ్యాక్ అయ్యాక పవన్ ఫాన్స్ ఎక్కడా ఆగడం లేదు.
గత ఏడాది కరోనా కారణంగా సెలెబ్రేట్ చెయ్యలేకయిన పవన్ బర్త్ డే ని ఈసారి గట్టిగ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఇక పవన్ లేటెస్ట్ మూవీస్ భీమ్లా నాయక్ నుండి ఉదయం 11 గంటలకు ఫస్ట్ సింగిల్ తో అప్ డేట్ ఇవ్వబోతుంటే.. హరీష్ శంకర్ మూవీ నుండి సాయంత్రం 4 గంటలకి స్పెషల్ అప్ డేట్ అంటూ మైత్రి మూవీ మేకర్స్ అప్ డేట్ ఇచ్చేసింది. ఇక మిగిలిన క్రిష్ - పవన్ హరి హర వీరమల్లు సంగతి తేల్చేసింది నిర్మాణ సంస్థ. హరి హర వీరమల్లు నుండి
Tomorrow, 01:20pm! #HariHaraVeeraMallu 💫 స్పెషల్ అప్ డేట్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లు టీజర్ కానీ, లేదంటే రిలీజ్ డేట్ పోస్టర్ కానీ రావొచ్చని ఫాన్స్ ఊహించుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాల నుండి స్పెషల్ అప్ డేట్స్, స్పెషల్ సర్ ప్రైజెస్ ఫాన్స్ కి సిద్దమైపోయాయి.