పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ రేపు కాదు ఒక రోజు ముందే అంటే ఈ రోజే మొదలైపోయాయి. పవన్ కళ్యాణ్ బ్యానెర్లు కట్టడం, ఆయన నటిస్తున్న సినిమా బ్యానెర్లు, కటౌట్స్ తో ఫాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. జనసైనికులు పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా హడావిడి మొదలు పెట్టేసారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ నుండి ఉదయం 11 గంటలకు ఫస్ట్ సింగిల్ ట్రీట్ అందుకోబోతున్నారు పవన్ ఫాన్స్. ఇంకా పవన్ నటిస్తున్న హరి హర వీరమల్లు అప్ డేట్ రాకపోయినా. పవన్ మరో సినిమా అప్ డేట్ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించింది నిర్మాణ సంస్థ.
అది పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కబోయే PSPK 28 అప్ డేట్ ని షురూ చేసింది. రేపు సాయంత్రం PSPK 28 అప్ డేట్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి పవన్ ఫాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ రేపు 4.05 PM
#PSPK28
Shuruuuuuu 🎉
అంటూ షేర్ చేసేసరికి పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ ని మించి తెరకెక్కబోయే PSPK 28 పై భారీ అంచనాలే ఉన్నాయి. హరీష్ శంకర్ పవన్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో అంటూ ఇప్పటినుండే ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక పవన్ బర్త్ డే స్పెషల్ గా రాబోతున్న PSPK 28 అప్ డేట్ అంటే ఏ టైటిల్ నో ఎనౌన్స్ చేస్తారో అంటూ తెగ క్యూరియాసిటీ పెంచేసుకుంటున్నారు ఫాన్స్.