హిట్ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడం, నేచురల్ స్టార్ నాని హీరో కావడంతో.. టక్ జగదీశ్ పై మొదటి నుండి భారీ అంచనాలున్నాయి. నాని - రీతువర్మ - ఐశ్వర్య రాజేష్ కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ టక్ జగదీష్ సెకండ్ వేవ్ కి ముందు థియేటర్స్ లో రీలీజ్ అవ్వాల్సి ఉన్నా.. కరోనా కారణముగా ఓటిటి నుండి వినాయక చవితి స్పెషల్ గా అమెజాన్ ప్రైమ్ నుండి సెప్టెంబర్ 10 న రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా నాని టక్ జగదీశ్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీం.
ఫ్యామిలీ డ్రామాగా టక్ జగదీశ్ విలేజ్ బ్యాగ్ డ్రాప్ లో, పల్లెటూర్లలో జరిగే గొడవలు, కక్షలు కార్పణ్యాల నేపథ్యంలో తెరకెక్కింది. భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి అనే డైలాగ్ తో టక్ జగదీశ్ ట్రైలర్ మొదలయ్యింది. జగపతి బాబు, నాని అన్నదమ్ములు. అన్నదమ్ముల మధ్యన ఎమోషనల్ డ్రామా, తండ్రి ఆశయం నిలబెట్టుకోవడం కోసం బలవంతులైన విలన్స్ కి ఎదురు నిలబడిన హీరో నాని యాక్షన్ కుమ్మేసాడు. భూ కక్షలు లేని భూదేవిపురం చూడాలనేది మా నాన్న కోరిక. ఇప్పుడది నా బాధ్యత అంటూ నాని చెప్పిన డైలాగ్, మేనకోడలు ఐశ్వర్య రాజేష్ తో నాని అనుబంధం, రీతూ అవర్మ ట్రెడిషనల్ లుక్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ ని హైలెట్ చేస్తూ టక్ జగదీశ్ సినిమా సాగింది అనేది టక్ జగదీశ్ ట్రైలర్ లో చూపించారు.