జబర్దస్త్ లో ఓ టీం లీడర్ గా ఉన్న ముక్కు అవినాష్ గత బిగ్ బాస్ సీజన్ 4 కి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అధిక పారితోషకం, అద్భుతమైన క్రేజ్ ఉన్న జబర్దస్త్ ని వదిలి అవినాష్ బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాడో అనుకున్నారు. అయితే కేవలం ఆర్ధిక పరిస్థితుల కారణంగానే తాను బిగ్ బాస్ లోకి వచ్చాను అన్నాడు. అలాగే తనకి పెళ్లి కావాలంటూ బిగ్ బాస్ హౌస్ లో కామెడీ చేస్తుండేవాడు. అతను పెళ్లి కోసం కలలు కంటున్నా అంటూ ఓపెన్ గానే చెప్పేవాడు. బిగ్ బాస్ లో అరియనతో ఫ్రెండ్ షిప్ చేసిన అవినాష్ ఆమెతో లవ్ ఎఫ్ఫైర్ నడుపుతున్నాడని ప్రచారము జరిగింది. ఇక బిగ్ బాస్ బయట కూడా పలు ఈవెంట్స్ లో అవినాష్ - అరియనాలు రెచ్చిపోయేవారు.
కానీ వారి మధ్యన ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంది అని క్లారిటీ చ్చేవారు. ఇక తాజాగా ముక్కు అవినాష్ కోరిక తీరింది. తాజాగా అవినాష్ పెళ్లి కుదరడం.. ఆ అమ్మాయితో నిశ్చితార్ధం కూడా చేసుకుని అందరికి షాకిచ్చాడు. సరైన వ్యక్తి జీవితంలోకి వస్తుంటే.. ఆలోచించాల్సిన అవసరం లేదు.. మా కుటుంబాలు, మేము కలిశాం. అనుజతో నాకు నిశ్చితార్థం అయింది. అంటూ ఫొటోస్ ని సోషల్ ఇండియాలో షేర్ చేసాడు అవినాష్.
పెళ్లి ఎప్పుడు అవినాష్ అంటూ మీరంతా నన్ను చాలా సార్లు అడిగారు. అతి త్వరలోనే నా అనుజతో ఎప్పటిలాగే మీ ఆశీస్సులు కోరుకుంటూ.. మీ ముక్కు అవినాష్ అంటూ ఇన్‌స్టా వేదికగా తన ఎంగేజ్మెంట్ విషయాన్నీ, ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.