Advertisementt

ఎన్టీఆర్ షో లో రాజమౌళి, రాఘవేంద్ర రావు

Tue 31st Aug 2021 06:58 PM
rajamouli,evaru meelo kotiswarulu show,young tiger ntr,jr ntr,celebrity guest,jr ntr show  ఎన్టీఆర్ షో లో రాజమౌళి, రాఘవేంద్ర రావు
Rajamouli and Raghavendra Rao in NTR show? ఎన్టీఆర్ షో లో రాజమౌళి, రాఘవేంద్ర రావు
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ జెమినీ ఛానల్ లో సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 8.30 నిమిషాలకు ప్రసారం అవుతుంది. ఓపెనింగ్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ఫ్రెండ్, ఆర్.ఆర్.ఆర్ హీరో రామ్ చరణ్ పాల్గొని.. అదరగొట్టేసాడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు ఎవరు మీలో కోటీశ్వరులు షో ని రక్తి కట్టించారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో ఎన్టీఆర్ ఆడించే షో లో కొంతమంది వేలతో, మరికొంతమంది లక్షల్లో గెలుచుకుని షో నుండి బయటికి వెళుతున్నారు. ఎన్టీఆర్ కూడా ఏ మాత్రం తగ్గకుండా హోస్ట్ గా అదరగొట్టేస్తున్నాడు. ఎన్టీఆర్ లుక్స్, ఎన్టీఆర్ స్టయిల్ కి బుల్లితెర ప్రేక్షకులు అభిమానులుగా మారిపోతున్నారు. 

అయితే తాజాగా ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ముగించెయ్యడంతో.. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో షూట్ లో పాల్గోంటున్నాడు. తాజాగా ఈ షో కి గెస్ట్ లు గా రాజమౌళి, రాఘవేంద్ర రావు లు వచ్చినట్టుగా కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి, రాఘవేంద్ర రావు లు ఎవరు మీలో కోటీశ్వరులు షో జరిగే సెట్ నుండి కొన్ని ఫొటోస్ లీకయ్యాయి. ఇప్పుడు ఆ ఫొటోస్ చూసాక రాజమౌళి, రాఘవేంద్ర రావు లు ఈ షోకి గెస్ట్ లుగా వచ్చారంటూ అందరూ ఊహించేసుకుంటున్నారు. 

Rajamouli and Raghavendra Rao in NTR show?:

Rajamouli to be the next celebrity guest on Jr NTR show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ