పవన్ కళ్యాణ్ బర్త్ డే కోసం పవన్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒకే ఒక్క రోజు పవన్ బర్త్ డే వేడుకలకి టైం అయ్యిందిలే అంటూ హంగామా చేస్తున్నారు. సెప్టెంబర్ 2 అంటే గురువారం పవన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని ఫాన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్ డేట్స్ కూడా సిద్దమవుతున్నాయనే న్యూస్ తో మరింతగా సంబర పడిపోతున్నారు పవన్ ఫాన్స్. అది పవన్ - రానా కాంబోలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ నుండి ఫస్ట్ సింగిల్ వదులుతున్నట్టుగా టైం కూడా ఇచ్చేసారు.
అయితే క్రిష్ తో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు అప్ డేట్ పై ఫాన్స్ అతృతతో ఉన్నారు. మరోపక్క హరీష్ శంకర్ తో పవన్ చెయ్యబోయే మూవీపై కూడా అందరిలో క్యూరియాసిటీ ఉంది. అయితే తాజాగా క్రిష్ మూవీ అప్ డేట్ కానీ, హరీష్ మూవీ అప్ డేట్ కానీ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున రావడం లేదని, ఆ రోజు మొత్తం భీమ్లా నాయక్ నే ట్రెండ్ చెయ్యాలని పవన్ ఫ్రెండ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. సాగర్ కె చంద్ర భీమ్లా నాయక్ కి డైరెక్టర్ అయినా.. అక్కడ భీమ్లా నాయక్ సెట్స్ లో త్రివిక్రమ్ దే హవా మొత్తం.
అందుకే త్రివిక్రమ్ పవన్ బర్త్ డే కి ఆయన అప్ కమింగ్ మూవీస్ నుండి ఎలాంటి అప్ డేట్ లేకుండా కేవలం భీమ్లా నాయక్ నే హైలెట్ చేసేందుకు చూస్తున్నారంటూ సోషల్ మీడియా టాక్. క్రిష్ హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ లు సైలెంట్ గా ఉన్నారని, లేదంటే వారు కూడా తమ మూవీ అప్ డేట్స్ తో పవన్ ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చేవారని, త్రివిక్రమ్ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లారని అంటున్నారు.