లవ్ స్టోరీ సెప్టెంబర్ 10 వినాయక చవితి రిలీజ్ అంటూ డేట్ ఇచ్చేసారు మేకర్స్. కానీ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. అలా లవ్ స్టోరీ డేట్ ఇచ్చిన తర్వాత మేకర్స్ కానీ, నాగ చైతన్య కానీ, సాయి పల్లవి కానీ పత్తా లేకుండా పోయారు. అసలు లవ్ స్టోరీ సెప్టెంబర్ 10 న ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడు అందరిలో అనుమానం. లవ్ స్టోరీ మేకర్స్ గాఢ నిద్రలో ఉన్నారు. లేదంటే సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అని కానీ, లేదంటే.. సినిమా రిలీజ్ త్వరలోనే అని కానీ, కొత్త డేట్ కానీ ఇలా ఏ విషయంలోనూ మేకర్స్ మాట్లాడడం లేదు.
అసలు సెప్టెంబర్ 10 న థియేటర్స్ లోకి వచ్చే సీటిమార్, ఓటిటి నుండి రిలీజ్ కాబోతున్న టక్ జగదీశ్ సినిమా కానీ ట్రైలర్ రిలీజ్, ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ అంటూ హంగామా మొదలు పెట్టేశాయి. కానీ అఫీషియల్ గా డేట్ ఇచ్చిన లవ్ స్టోరీ మేకర్స్ మాత్రం మొద్దు నిద్రలో ఉండిపోయారు. కనీసం డేట్ మార్పుపై క్లారిటీ అయినా ఇస్తే బావుంటుంది అని అక్కినేని ఫాన్స్ లవ్ స్టోరీ మేకర్స్ ని డిమాండ్ చేస్తున్నారు.