కమెడియన్ కాసస్తా.. బడా హీరో ల నిర్మాతగా టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ ఎన్టీఆర్ టెంపర్ తర్వాత మళ్ళీ సినిమాలేవీ నిర్మించలేదు. ఈమధ్యన పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలని తహతహలాడుతున్నాడు. పవన్ తో సినిమా నిర్మించడానికి కొన్నేళ్లు పట్టేసేలా కనిపించడంతో బండ్ల గణేష్ మళ్ళీ కమెడియన్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరూ మూవీలో నటించిన బండ్ల గణేష్ మంచి పాత్రలు వస్తే సినిమాల్లో నటించడానికి ఫిక్స్ అయ్యాడు. అయితే బండ్ల గణేష్ ని కరోనా దెబ్బ రెండుసార్లు కాటు వేసింది. రెండోసారి చచ్చి బ్రతికాను అది కూడా చిరంజీవి గారి వల్ల అంటూ ఈమధ్యన బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు కూడా..
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ తనకి ఎన్టీఆర్ కి మధ్యన వచ్చిన మనస్పర్ధలపై పెదవి విప్పాడు.
ఎన్టీఆర్ తో బండ్ల గణేష్ బాద్షా, టెంపర్ మూవీస్ నిర్మించాడు. టెంపర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ కి రెమ్యునరేషన్ విషయంలో బండ్ల తో గొడవ జరిగినట్టుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ కి బండ్లకి టెంపర్ దగ్గర నుండి మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే మా మధ్యన గొడవేం లేదు కానీ.. అది కేవలం ఒక మిస్ కమ్యూనికేషన్ మాత్రమే అని ఎంతో అన్యోన్యంగా ఉండే భార్య భర్తల మధ్యలో, అలాగే అన్నాచెల్లెళ్ల మధ్య లో వచ్చే గొడవల్లాంటివే ఇది కూడా అంటూ చాలా తేలిగ్గా యంగ్ టైగర్ కి తనకి మధ్యన ఏం లేదని చెప్పేసాడు. మిస్ కమ్యూనికేషన్ వల్ల ఒక చిన్న డిస్కషన్ జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు.