Advertisementt

మెగా ఫ్యామిలీ మ్యూజికల్ నైట్

Mon 30th Aug 2021 07:33 PM
mega family,mega family musical night,megastar chiranjeevi,pv sindhu  మెగా ఫ్యామిలీ మ్యూజికల్ నైట్
Mega Family Musical Night మెగా ఫ్యామిలీ మ్యూజికల్ నైట్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ ఇంట్లో మెగా మ్యూజికల్ నైట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్యనే చిరు బర్త్ డే వేడుకలు, రాఖి పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించిన మెగా ఫ్యామిలీ, టోక్యో ఒలింపిక్స్ విజేత పివి సింధుని కూడా ఘనంగా సత్కారించి.. సినీ ప్రముఖలకి మాంచి పార్టీ కూడా ఇచ్చింది. నాగార్జున, రానా, మెగా హీరోలు పాల్గొన్న పివి సింధు సత్కార పార్టీలో మెగా ఫ్యామిలీ ఓ మెగా మ్యూజికల్ నైట్ ని నిర్వహించినట్టుగా టాక్. చిరు బర్త్ డే వేడుకలు, పివి సింధు సత్కార విందులో ఈ మ్యూజికల్ నైట్ హైలెట్ గా నిలిచింది అని అంటున్నారు. 

ఆ మ్యూజికల్ నైట్ లో మెగాస్టార్ పాడిన పాటలకు మెగా ఫ్యామిలీ వేసిన స్టెప్స్ హైలెట్ గా నిలిచాయట. నాగార్జున, రానా, మెగా హీరోలు, రామ్ చరణ్, మెగా డాటర్స్ అంత కలిసి ఈ మెగా మ్యూజికల్ నైట్ లో సందడి చేసారని, అయితే ఈ ఈవెంట్ కి సంబందించిన ఫొటోస్ బయటికి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఏడాది మెగాస్టార్ ఇంట్లో పవన్ కూడా చిరు బర్త్ డే, రాఖి వేడుకలకి హాజరవడం అందరిని ప్రముఖంగా ఆకట్టుకుంది. 

Mega Family Musical Night:

Mega family musical night

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ