Advertisementt

విశాఖ రాజధాని అంటే చంద్రబాబు ఏమంటారు

Mon 30th Aug 2021 06:54 PM
avanthi srinivas,ap minister,avanthi sensational comments,chandrababu naidu  విశాఖ రాజధాని అంటే చంద్రబాబు ఏమంటారు
Avanthi Srinivas Sensational Comments on Chandrababu Naidu విశాఖ రాజధాని అంటే చంద్రబాబు ఏమంటారు
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఆంధ్రా మొత్తం మూడు రాజధానుల కుంపటి తో హాట్ హాట్ గా మారింది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి అమరావతి ని రాజధానిగా క్యాన్సిల్ చేసి విశాఖ, కర్నూల్, అమరావతి అంటూ మూడు రాజధానుల పాట మొదలు పెట్టారు. ప్రతి పక్షాలు మొత్తుకుంటున్నా.. అమరావతి ప్రజలు వేడుకుంటున్నా జగన్ సర్కార్ మాత్రం దిగిరావడం లేదు. అయితే తాజాగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నానికి చంద్రబాబు అనుకూలమా.. వ్యతిరేకమా.. అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూటిగా చంద్రబాబుని ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. 

సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయని అన్నారు. హైదరాబాద్‌పై పెట్టుబడి పెట్టడం వల్ల విభజనతో ఇప్పుడు నష్టం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితే విద్వేషాలు ఏర్పడవని వివరించారు. విశాఖకు అన్ని రాజధాని హంగులు ఉన్నాయని తెలిపారు. అత్యాశగా విశాఖపట్నం రాజధాని కోరలేదని, అన్ని అర్హతలు ఉన్నాయి కనుకనే విశాఖను రాజధాని నగరంగా ప్రకటించామని చెప్పారు. 

తెలుగు దేశం పార్టీకి విశాఖలో ఓట్లు, సీట్లు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అవసరం లేదని ఆయన చంద్రబాబు పై మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉ‍ప్పుడు పట్టించుకున్నారా అని అన్నారు. అసలు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీ చేసిందేమి లేదన్నారు.

టీడీపీ నేతలు చెప్పిన అబద్దాలే పదేపదే చెబుతున్నారని మంత్రి అవంతి ధ్వజమెత్తారు.

Avanthi Srinivas Sensational Comments on Chandrababu Naidu:

Ap Minister Avanthi Srinivas Sensational Comments on Chandrababu Naidu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ