మంచు మోహన్ బాబు కొడుకుల్లో విష్ణు, మనోజ్ పెళ్లిళ్లు చేసుకుని.. మంచు మనోజ్ తన భర్య తో విడాకులు తీసుకుని ఒంటరిగానే ఉన్నాడు. మరోపక్క మంచి విష్ణు తన భార్య పిల్లలతో కలిసి తండ్రి దగ్గరే ఉంటున్నాడు. మంచు విష్ణు కి ఇద్దరు కవల ఆడపిల్లలు అరియనా, వివియానా, ఒక కొడుకు, మరో పాప ఉంది. ఇక మంచు లక్ష్మి కి పాప మంచు విద్య నిర్వాణ. అయితే మంచు విష్ణు తన పిల్లలతో ఎంజాయ్ చేసే మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.
తాజాగా మోహన్ బాబు తన మనవడు కృష్ణుడి గెటప్ లో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. మంచు విష్ణు కొడుకు శ్రీ కృష్ణ జన్మాష్టమి స్పెషల్ గా కృష్ణుడి గేటుప్ లో అదరగొట్టేసాడు. మంచు వారి బుల్లి కృష్ణుడు అంటూ అందరూ మంచు విష్ణు కొడుకు అవ్రం మంచు ని ముద్దాడుతున్నారు. మరి మీరు మంచు మోహన్ బాబు మనవడు, మంచు విష్ణు కొడుకు కృష్ణుడి గెటప్ ని చూసెయ్యండి.