ప్రతి శుక్రవారం పొలోమంటూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గత వారం మూడు నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి రాగా.. అవన్నీ సో సో టాక్ తో మిగిలిపోయాయి. ఇక ఈ శుక్రవారం మళ్ళీ సినిమాల జాతర మొదలయ్యింది. ఈ వారం సెప్టెంబర్ 3 న శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా రిలీజ్ అవుతుంది. వైవిధ్యమైన పాత్రలతో అదరగొట్టేస్తున్న శ్రీనివాస్ అవసరాల నూటొక్క జిల్లాల అందగాడు సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
అరుణ్ ఆదిత్ - మేఘ ఆకాష్ జంటగా నటించిన డియర్ మేఘ సినిమా కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ పరంగా దూసుకుపోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇంకా సుజన్, తనీష్క్ జంటగా చలపతి పువ్వల తెరకెక్కించిన చిత్రం అప్పుడు ఇప్పుడు.. కార్తీక్ సాయి, డాలీ షా, నేహా దేశ్‌పాండే నటించిన ది కిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అశ్మీ సినిమాలు సెప్టెంబర్ 3 న రిలీజ్ అవుతున్నాయి. ఇక సెప్టెంబర్ 3 నే రిలీజ్ కావాల్సిన గోపీచంద్ సీటిమార్ వినాయక చవితి స్పెషల్ గా పోస్ట్ పోన్ అయ్యింది.