త్రివిక్రమ్ ఇప్పుడు టాప్ డైరెక్టర్. అలా వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా కష్టాలు పడ్డారు. నటుడు సునీల్ ఇంకొంతమంది (దశరద్) కలిసి ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ సినిమాలకు స్టోరీలు రాయడం చేసేవారనే విషయం బహిరంగ సత్యమే. పంజాగుట్టలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంటి నుండి సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ.. ఇప్పుడు టాప్ పొజిషన్ ని మెయింటింగ్ చేస్తున్నారు త్రివిక్రమ్ బ్యాచ్.
అయితే ఇప్పుడు పొజిషన్ మారి టాప్ రేంజ్ కి వెళ్లినా త్రివిక్రమ్ కి మాత్రం తాను పంజాగుట్టలో ఉన్న ఆ చిన్న ఇంటిని మాత్రం మరిచిపోలేదట. అందుకే తనకి వీలుగా ఉన్నప్పుడు త్రివిక్రమ్ ఆ ఇంటికి వేళ్ళు కథలు రాస్తుంటారట. అందుకే ఆ ఇంటికి ఇప్పటికి అద్దె చెల్లిస్తున్నారట. ఆ ఇంట్లో కూర్చుంటే.. కథలు రాయడం సులభంగా అలాగే సక్సెస్ సాధించవచ్చని త్రివిక్రమ్ సెంటిమెంట్ గా ఆ ఇంటికి అద్దె చెల్లిస్తూ తన కిందే ఉంచేసుకున్నారట. త్వరలో మరో కొత్త కథను రెడీ చేసే పనిలో ఉన్నట్టు వినికిడి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఓ మూవీ చెయ్యడానికి రెడీగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియం రీమేక్ కి హెల్ప్ చేస్తున్నారు.