నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 న మొదలు కావడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఫైనల్ లిస్ట్ సిద్దమైపోయి కంటెస్టెంట్స్ ని క్వారంటైన్ చేసింది స్టార్ మా. హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని క్వారంటైన్ లో పెట్టినట్లుగా .. అటునుండి అటే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన బిగ్ బాస్ సెట్ కి సెప్టెంబర్ 4 న తరలించి.. వాళ్లని గగ్రాండ్ గా హౌస్ లోకి పంపే ఏరాట్లు చేస్తుందట స్టార్ మా.
ఇక బిగ్ బాస్ లోకి వెళ్లబోయే సెలబ్రిటీస్ కి సంబందించిన సోషల్ మీడియా టీమ్స్ తమ వర్క్ ని స్టార్ట్ చేసేసాయట. హౌస్ లో ఆయా సెలెబ్రిటీస్ ఎంటర్ అవ్వగానే వారు రంగంలోకి దిగిపోయి తమ తమ సెలబ్రిటీస్ ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ వారికీ ఓట్స్ పడేలా చేస్తారన్నమాట. అయితే యాంకర్ రవి పేరు గట్టిగా వినిపించినా.. రవి బిగ్ బాస్ 5 కి వెళ్లలేదని తెలుస్తుంది. మరో పక్క సిరి హన్మంత్ మాత్రం బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబట్టే.. క్వారంటైన్ చేసారు. కాబట్టే జబర్దస్ కి రావడం లేదు. ఇక మిగతా వారి చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి ఫైనల్ గా ఎవరు హౌస్ లోకి వెళతారో సెప్టెంబర్ 5 న తెలిసిపోతుంది.