ఏ భాష ఇండస్ట్రీలో అయినా.. డ్రగ్స్ కలకలమనేది ఇప్పటిది కాదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే సినీతారలు ఉన్నారు. వాళ్ళకి సప్లై చేయడానికి ముందుండే సెలెబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే ఆ డ్రగ్స్ రాకెట్ బయటికొచ్చినప్పుడు పోలీస్ లు, ఎన్సీబీ, ఈడీ హడావిడి చెయ్యడం తప్ప.. తర్వాత మల్లి ఈ డ్రగ్స్ కేసు, ఆ డ్రగ్స్ ఊసు ఉండను కూడా ఉండదు. గతంలో టాలీవుడ్ లో పలువురు సినీతారల పేర్లు ఈ డ్రగ్స్ రాకెట్ విషయంలో మీడియాలో హైలెట్ అవవడమే కాదు.. పోలీస్ విచారణలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ కేసు నీరుగారిపోవడం, మళ్ళీ అదే కేసు మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ మరోసారి హడావిడి చేస్తుంది. గతంలోనూ బాలీవుడ్ లో ఈ డ్రగ్స్ కేసు విషయం హాట్ హాట్ గానే ఉనా.. ఆ తర్వాత చల్లారిపోయింది.
ఇప్పుడు టాలీవుడ్ ఈడీ నోటీసు లు అందుకున్న టాలీవుడ్ 12 మంది సెలబ్రిటీస్ విషయంలోనూ ఈడీ ఎలాంటి స్టెప్స్ వేస్తుందో? ఎలాంటి విచారణ చేస్తుందో? అనే ఆసక్తితో అందరూ ఉన్నారు. నేరం చేసినట్లుగా నిరూపితమైతే ఆస్తులు జప్తు చేస్తామన్న సందేశాన్ని కూడా ఈడీ సెలబ్రిటీస్ కీ ఇచ్చింది. ఓ పబ్ నిర్వాహకుడు పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ కి డ్రగ్స్ సప్లై చేసాడని, అతని ఆస్తులని ఈడీ జప్తు చెయ్యడం ఖాయమని అంటున్నారు. అయితే ఇంత హడావి చేసే ఈడీ కూడా సెలబ్రిటీస్ విచారణ తర్వాత సైలెంట్ అవడం ఖాయమని, ఈ డ్రగ్స్ కేసు ని పూర్తిగా ఛేదించడమనేది కలే అంటున్నారు.