Advertisementt

ద డెవిల్ ఈజ్ బ్యాక్: కింగ్ బంగార్రాజు

Sun 29th Aug 2021 12:28 PM
bangarraju movie,bangarraju-the devil is back,nagarjuna,nagarjuan birthday,nagarjuna bangarraju  ద డెవిల్ ఈజ్ బ్యాక్: కింగ్ బంగార్రాజు
Naga Chaitanya releases Bangarraju new poster ద డెవిల్ ఈజ్ బ్యాక్: కింగ్ బంగార్రాజు
Advertisement
Ads by CJ

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున తండ్రి కొడుకులుగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో నాగార్జున దానికి సీక్వెల్ గా సోగ్గాడే చిన్ననాయన సినిమాలోని తన కేరెక్టర్ పేరు బంగార్రాజు ని సినిమాగా చెయ్యాలని డిసైడ్ అయ్యి.. కొన్నేళ్లు గడిచిపోయింది. నాగార్జునకి బంగార్రాజు స్క్రిప్ట్ పై అనుమానం, కళ్యాణ్ కృష్ణ పర్సనల్ పనులతో లేట్ అయినా ఈ ప్రోజెక్ట్ ఎట్టకేలకు ఈ ఏడాది ఈ నెలలోనే బంగార్రాజు షూటింగ్ మొదలైంది. ఈ సినిమా లో నాగార్జున - నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున పంచె కట్టు, పెల్లెటూరి కేరెక్టర్ తో ఓస్ వాడి తస్సాదియ్యా అంటూ చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. 

అందుకే అదే కేరెక్టర్ తో నాగార్జున బంగార్రాజుని మొదలు పెట్టారు. ఈ సినిమాలో నాగార్జునకి జోడిగా రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడిగా కృతి శెట్టి(ఉప్పెన బ్యూటీ) నటిస్తుంది. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిన బంగార్రాజు నుండి నాగార్జున బర్త్ డే స్పెషల్ పోస్టర్ ని రివీల్ చేసింది టీం. ద డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ బంగార్రాజూ గెటప్ లో, కింగ్ నాగ్ పంచెకట్టు తో మరోసారి మైమరపింపచెయ్యడానికి రెడీ అయ్యారు. కింగ్ నాగ్ బర్త్ డే రోజున బంగార్రాజు నుండి ఫస్ట్ లుక్ వచ్చేసింది. దానితో అక్కినేని ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

Naga Chaitanya releases Bangarraju new poster:

 Bangarraju-The devil is back dazzles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ