ఇప్పడు ఇండస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఆర్.ఆర్.ఆర్ సినిమా అక్టోబర్ 13 న రిలీజ్ అవుతుందా? అనే అనుమానం అందరిలో ఎక్కువైపోతోంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫాన్స్ అయోమయంలో ఉన్నారు. ఏ సినిమా డేట్ మారినా మా డేట్ మారదంటూ రాజమౌళి ప్రతిసారి ఆర్.ఆర్.ఆర్ డేట్ పై క్లారిటీ ఇస్తూ వస్తున్నా.. మొన్న వదిలిన ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ లో అక్టోబర్ 13 డేట్ ఇవ్వకపోవడం, సోషల్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ అయినట్లుగా వార్తలు వస్తున్న మేకర్స్ స్పందించకపోవడంతో ఆల్మోస్ట్ ఆర్.ఆర్.ఆర్ మరోసారి వాయిదా తప్పేలా లేదంటున్నారు.
అయితే అదేదో ఆర్.ఆర్.ఆర్ అఫీషియల్ గా వాయిదా పడింది అని ప్రకటించేస్తే.. అఖండ, ఆచార్య సినిమాల డేట్స్ ని దసరాకి ఇవ్వొచ్చని చూస్తున్నారు బాలయ్య, చిరు లు. ఇప్పటికే శర్వానంద్ వాళ్ళు మహాసముద్రాన్ని అక్టోబర్ 14 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక ఆర్.ఆర్.ఆర్ అధికారికంగా వాయిదా న్యూస్ రాగానే ఆచార్య, అఖండ మేకర్స్ లైన్ లోకొచ్చేసి రిలీజ్ డేట్స్ ఇచ్చెయ్యడానికి కాచుకుని కూర్చున్నారు. సో ఆర్.ఆర్.ఆర్ విషయం ఏదో ఒకటి తేల్చమంటున్నారు వాళ్ళు.