Advertisementt

ఒక వారం వెనక్కి వెళ్లిన సీటీమార్‌

Sat 28th Aug 2021 06:02 PM
gopichand,seeti marr movie,seeti marr movie changes its release date  ఒక వారం వెనక్కి వెళ్లిన సీటీమార్‌
Seeti Marr changes its release date ఒక వారం వెనక్కి వెళ్లిన సీటీమార్‌
Advertisement
Ads by CJ

క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ సీటీమార్‌. గోపీచంద్ -  డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో గోపిచంద్ కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్‌ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ...

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ నిజానికి  ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం.అ యితే పండ‌గ రోజుల్లో ప్ర‌తి తెలుగువాడు కుటుంబంతో క‌లిసి సంతోషంగా ఉంటారు. ఆ సంతోషాన్ని ఎక్కువ చేసే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను కోరుకుంటారు ఆడియెన్స్‌. అందుకోసం మంచి సినిమాను చూడాల‌నుకుంటారు. అలాంటి వారికి మా సీటీమార్‌మంచి విందు భోజ‌నంలా ఉంటుంద‌ని నిర్మాత‌గానే కాదు, స‌గ‌టు ప్రేక్ష‌కుడిగా భావించి మా చిత్రాన్ని వినాయక చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేస్తున్నాం. 

గోపీచంద్‌గారు ఆంధ్ర టీమ్ క‌బ‌డ్డీ కోచ్‌గా, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టించారు. ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి స‌రికొత్త పాత్ర‌ల్లో మెప్పిస్తార‌న‌డంలో సందేహం లేదు. స్పోర్ట్స్ మూవీ అంటే ఎలా ఉండాలో అదే రేంజ్‌లో సినిమాను రూపొందించాం. వీరితో పాటు భూమిక, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌, అప్స‌రా రాణి చేసిన స్పెష‌ల్ సాంగ్ స్పెష‌ల్ సాంగ్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మా సినిమాకు మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌గారి మ్యూజిక్, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అండ్ టీమ్ వ‌ర్క్‌ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. 

ఇక డైరెక్ట‌ర్ సంపత్ నందిగారి టేకింగ్‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను ప‌ర్‌ఫెక్ట్స్‌గా మిక్స్ చేసి ప్ర‌తి సీన్ గ్రాండియ‌ర్‌గా, ఎగ్జయిట్‌మెంట్‌తో ప్రేక్ష‌కుల‌న అల‌రించేలా ఆయ‌న సినిమాను డైరెక్ట్ చేశారు. వినాయక చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న థియేట‌ర్స్‌లో వ‌స్తున్న మా సీటీమార్ చిత్రం హండ్రెడ్ ప‌ర్సెంట్ ఆడియెన్స్‌కు ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంద‌ని క‌చ్చితంగా చెబుతున్నాను అన్నారు. 

Seeti Marr changes its release date:

Gopichand Seeti Marr changes its release date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ