మా ఎన్నికలు ఇప్పుడు టాలీవుడ్ లో హీట్ ని లేవుతున్నాయి. అందులో ఇప్పుడు నాగార్జున బర్త్ డే రోజున ఏదో జరగబోతుంది. నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ లో నాగ్ కి తెలియకుండానే ఏదో జరుగుతుంది. నాగార్జున బర్త్ డే రోజున పార్టీ ఇస్తూ అందులో మా ఎన్నికల ఓట్ల సమీకరణ చెయ్యడానికి ప్రకాష్ రాజ్ ప్యానల్ ఏర్పాట్లలో ఉన్నట్లుగా టాక్. నటుడు సమీర్ నాగార్జున బర్త్ డే కి పిలిచి అందులోని వారితో ఓట్లు సమీకరించాలని ప్లాన్ చేశారట. బిగ్ బాస్ లో పాల్గొన్న మా సభ్యులని నాగ్ బర్త్ డే కి పిలిస్తున్నారట సమీర్.
సమీర్ పలువురు బిగ్ బాస్ సభ్యులకి ఇన్విటేషన్స్ ఇస్తున్నారట. బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా చేస్తూ అందులో నుండి ప్రకాష్ రాజ్ కి ఓట్లు వేయించాలని చూస్తున్నట్టుగా సమాచారం. సమీర్ ఈ బర్త్ డే ఏర్పాట్లలో ఉన్నారట. అయితే నాగ్ బర్త్ డే ఇన్వెటేషన్స్ విషయంలో నాగార్జునకి తెలియకుండానే ఇన్విటేషన్స్ వెళుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ మా ఎన్నికల విషయంలో నాగ్ పేరు బయటికి రావడంతో ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.