Advertisementt

మాది ఫ్రెండ్ షిప్ అంటూ షాకిచ్చారే

Sat 28th Aug 2021 01:49 PM
rahul sipligunj,songs,albums,asghu reddy,rahul sipligunj - asghu reddy  మాది ఫ్రెండ్ షిప్ అంటూ షాకిచ్చారే
Rahul Sipligunj opens up about his relationship with Ashu మాది ఫ్రెండ్ షిప్ అంటూ షాకిచ్చారే
Advertisement
Ads by CJ

కలిసి తిరుగుతారు, కలిసి పార్టీలకు వెళతారు, ముద్దులు పెట్టుకుంటారు. అది వారి మధ్య ప్రేమ అనుకున్నవారికి షాకిస్తూ మేము స్నేహితులమే అంటారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రేమికులుగా ప్రాజెక్ట్ అయ్యి బయట ఫ్రెండ్స్ అంటూ బిల్డప్ ఇచ్చేవారు ఉన్నారు. గతంలో రాహుల్ సిప్లిగంజ్ - పునర్నవీలు హౌస్ లో చెట్టాపట్టాలేసుకుని తిరిగి బయట ఫ్రెండ్స్ అంటూ షాకివ్వగా.. గత బిగ్ బాస్ లో అఖిల్ - మోనాల్ అలాగే చేసారు. ఇక రాహుల్ పునర్నవిని లైట్ తీసుకుని ఆశు రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ త్వరలోనే ఓ న్యూస్ చెబుతానంటూ అందరిలో క్యూరియాసిటీ పెంచేశారు. 

అంటే వీరు లవర్స్ గా తిరుగుతున్నారు.. ఏ పెళ్లి డేటో చెబుతారని అనుకుంటే.. ఈవీరిద్దరూ కలిసి చేసిన ఆల్బమ్ ప్రమోషన్స్ కోసం వాళ్ళ రిలేషన్ ని వాడారు. ఈ నువ్వెవరు అనే సాంగ్ కోసం ఆషూరెడ్డి - రాహుల్ కలిసి పనిచేసారు. ఆ సాంగ్ కి మంచి క్లిక్స్ రావడంతో హిట్ అయింది. దానితో రాహుల్ సిప్లిగంజ్ కి అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక రాహుల్ ఈ సాంగ్ కోసం ఆశు మూడు రోజుల పాటు కష్టపడింది ఆని, కానీ మూడు రోజులకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, స్నేహం కోసం ఆమె అంతలా తనకు సపోర్ట్ చేసిందని ఇదే నిజమైన ఫ్రెండ్ షిప్ అని రాహుల్ సిప్లిగంజ్ చెప్పుకొచ్చాడు.

మరి రాహుల్ సిప్లిగంజ్ తన గురించి అంతలా చెబుతుంటే ఆశు ఊరుకుంటుందా ఆమె కూడా వెంటనే లవ్ యు రాహుల్ అని చెప్పుకొచ్చింది. దీనితో రాహుల్ -  అషులది కేవలం ఫ్రెండ్ షిప్ అంటూ కన్  ఫర్మ్ చెయ్యడం, ఓ నెటిజెన్ కూడా నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే ఇదే అంటూ రీ ట్వీట్ చెయ్యడంతో రాహుల్ థాంక్స్ అండీ మా స్నేహాన్ని గుర్తించిన మొదటి వారు మీరె అంటూ చెప్పుకొచ్చాడు. 

Rahul Sipligunj opens up about his relationship with Ashu:

Rahul Sipligunj thanks to Asghu reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ