ఇండియాలో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 46,759 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,49,947కి చేరింది. అలాగే, నిన్న 31,374 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 509 మంది మృతి చెందారు.
అయితే దేశం మొత్తంలో మహారాష్ట్ర, కేరళలో కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశంలో ఎక్కువ కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం కేరళ వాసులని వణికిస్తుంది. అయితే అక్కడ కేరళలో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో మారినితగా కరోనా కేసులు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక దేశంలో కరోనా మొదలైనప్పటినుండి మొత్తం మృతుల సంఖ్య 4,37,370కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 3,18,52,802 మంది కోలుకున్నారు. 3,59,775 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. నిన్న 1,03,35,290 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు. దీంతో మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 62,29,89,134 కు చేరింది.