Advertisementt

ప్రీ లుక్ తోనే నాగ్ యాక్షన్ చూపించేసాడు

Fri 27th Aug 2021 08:14 PM
king nagarjuna,praveen sattaru,nag - praveen sattaru film pre-look  ప్రీ లుక్ తోనే నాగ్ యాక్షన్ చూపించేసాడు
Nagarjuna, Praveen Sattaru Film Pre-Look Poster Out ప్రీ లుక్ తోనే నాగ్ యాక్షన్ చూపించేసాడు
Advertisement
Ads by CJ

ఈ ఏడాది వైల్డ్ డాగ్ తో అదరగొట్టేసిన కింగ్ నాగార్జున‌ తాజగా డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. యాక్ష‌న్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌బోయే చిత్రంగా దీన్ని హై యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున ప‌వ‌ర్‌పుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

శుక్ర‌వారం నిర్మాత సునీల్ నారంగ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి  ఓ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇందులో నాగార్జున యాక్ష‌న్ ప్యాక్డ్ లుక్‌లో క‌త్తి చేత ప‌ట్టుకుని క‌నిపిస్తున్నారు. అలాగే ఈ సినిమా నుంచి కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్ 29)న ఎగ్జ‌యిటింగ్ అప్‌డేట్ రానుంది.

యాక్ష‌న్ చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ సినిమా కోసం అద్భుత‌మైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. నిర్మాత‌లు హై బ‌డ్జెట్‌లో, సూప‌ర్బ్ అనిపించే విజువ‌ల్స్‌తో ఈ సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. 

Nagarjuna, Praveen Sattaru Film Pre-Look Poster Out:

King Nagarjuna, Praveen Sattaru Film Pre-Look Poster Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ