రకుల్ ప్రీత్ ఏడవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే నిన్న ఈ టైం కి రకుల్ ప్రీత్ కి టాలీవుడ్ కేసులో నోటీసు లు అందాయి. ఈడీ నుండి సమన్లు అందుకున్న రకుల్ ప్రీత్ ఏడ్చింది అనుకుంటున్నారేమో.. కాదండోయ్.. రకుల్ ప్రీత్ ఏడ్చింది ఎందుకంటే.. చాలా నెలలతర్వాత రకుల్ తన ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి థియేటర్ లో సినిమా చూసి కన్నీరు పెట్టుకుని తన ఇన్స్టా పేజీ లో పెద్ద స్టోరీ పెట్టింది.
బాలీవుడ్ సినిమాలతో తలమునకలైన రకుల్ ప్రీత్ తెలుగులో ఓబుళమ్మ పాత్రలో కొండ పొలం సినిమాలో నటించింది. ఆ సినిమాలో రకుల్ ప్రీత్ డీ గ్లామర్ గా కనిపిస్తుంది. ఇక బాలీవుడ్ మూవీ షూటింగ్స్ తో బిజీగా మారిన రకుల్.. కాస్త గ్యాప్ తీసుకుని ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తుంది. అయితే అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ మూవీ చూడడానికి థియేటర్స్ కి వెళ్ళినప్పుడు.. చాలా నెలల తర్వాత స్క్రీన్ మీద టైటిల్స్ చూడగానే ఎమోషనల్ అయ్యాను అని, స్క్రీన్ మీద సినిమా చూస్తున్నంతసేపు ఆ ఆనందం మాటల్లో చెప్పలేక కన్నీళ్లు వచ్చేసాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్, బెల్ బాటమ్ మూవీ టీం ని అభినందించింది. సో అదన్నమాట రకుల్ కన్నీటికి కారణం.