ఈమధ్యన హీరో విశ్వక్ సేన్ తరుచు వార్తల్లో నిలుస్తున్నాడు. విశ్వక్ రీసెంట్ మూవీ పాగల్ ప్రమోషన్స్ లో కాస్త ఎక్కువగా మాట్లాడడమే కాదు.. విశ్వక్ సేన్ ఆ తర్వాత కూడా తన సినిమాని కావాలనే కొంతమంది చంపేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. పాగల్ బావున్నా రివ్యూ రైటర్స్ వలన సినిమా ప్రేక్షకుడికి నచ్చలేదంటూ ఏవేవో మాట్లాడి వార్తల్లో నిలిచాడు. ఇక తాజాగా విశ్వక్ సేన్ కరోనా ని నమ్ముకున్నాడట. అంటే కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి, మంచి రోజులొచ్చాయి, WWW లాంటి సినిమాలు తెరకెక్కినట్లుగా.. లాక్ డౌన్ నేపథ్యంలోనే విశ్వక్ సేన్ తాజా మూవీ అశోక వనంలో అర్జున కల్యాణం తెరకెక్కుతుంది.
కొత్త దర్శకుడు విద్యాసాగర్ చింతా దర్శకుడిగా పరిచయమవుతూ తెరకేక్కుతున్న అశోక వనంలో అర్జున కల్యాణం లాక్ డౌన్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఓ అబ్బాయి… అమ్మాయిని చూడ్డానికి పెళ్లి చూపులకు వెళ్తాడు. సరిగ్గా అదే రోజు.. లాక్ డౌన్ ప్రకటిస్తారు. దాంతో.. అబ్బాయి కుటుంబం మొత్తం.. అమ్మాయి ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ తరవాత ఏం జరిగిందన్నదే అశోక వనంలో అర్జున కల్యాణం కథ. ఇక పెళ్లి చూపులు సినిమా లాగే సినిమా మొత్తం దాదాపుగా ఒకే ఇంట్లో జరుగుతుందట. దాని కోసమే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ కూడా నిర్మించినట్లుగా టాక్. ఈ సినిమాతో విశ్వక్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవడం ఖాయమంటున్నారు.