ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> ED summons Rakul Preet, Daggubati and 8 other celebrities

సెలబ్రిటీస్ ఈడీ విచారణకి హాజరవ్వాల్సిన డేట్స్

ED summons Rakul Preet, Daggubati and 8 other celebrities

2017 లో ఉన్నట్టుండి.. టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం. పలువురు సెలబ్రిటీస్ మీద డ్రగ్స్ కేసు పెట్టడం, వాళ్ళ విచారణ, బ్లడ్ శాంపిల్స్ సేకరించడం.. అబ్బో ఆ హడావిడి చూస్తే.. చాలామంది సెలబ్రిటీస్ జైలు కి వెళ్ళబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ కేసులో ఎవరికీ శిక్ష పడకపోగా.. టీఎస్ గవర్నమెంట్ సెలబ్రిటీస్ ని రక్షించే ప్రయత్నం చేసింది అనే టాక్ ఉండగానే కొంతమంది పై ఈ డ్రగ్స్ కేసు ఎత్తివేశారు కూడా. తెలంగాణ పోలీస్ లు డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీస్ కి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మరోసారి ఇప్పుడు ఈడీ సెలబ్రిటీస్ కి ఈ డ్రగ్స్ కేసులో నోటీసు లు ఇవ్వడం మరోసారి టాలీవుడ్ లో కలకలం రేపింది. 

అయితే అది డ్రగ్స్ కేసు కాదని మనీలాండరింగ్ కేసు అంటున్నారు. మరి డ్రగ్స్ కేసులో ప్రమేయం లేనప్పుడు ఈ మనీలాండరింగ్ కేసు ఎలా పెట్టారో తెలియదు కానీ.. ఇప్పుడు నోటీసులు అందుకున్న రకుల్ ప్రీత్, రానా, పూరి, ఛార్మి, రవితేజ ఇంకా మిగతా సెలబ్రిటీస్ ఈడీ ముందు హాజరవడానికి డేట్స్ ని కేటాయించింది. ఒక్కో సెలెబ్రిటీకి ఒక్కో డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ డేట్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు..

పూరి జగన్నాధ్: ఆగస్టు 31, ఛార్మి: సెప్టెంబర్ 2, రకుల్ ప్రీత్ సింగ్: సెప్టెంబర్ 6, రాణా దగ్గుబాటి: సెప్టెంబర్ 8, రవితేజ: సెప్టెంబర్ 9, శ్రీనివాస్: సెప్టెంబర్ 9, నవదీప్: సెప్టెంబర్ 13, ఎఫ్ క్లబ్ జీఎం: సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్: సెప్టెంబర్ 15, తనీష్:  సెప్టెంబర్ 17, నందు: సెప్టెంబర్ 20, తరుణ్: సెప్టెంబర్ 22న హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ.

ED summons Rakul Preet Singh, Rana Daggubati, Ravi Teja and other celebrities

ed summons
tollywood celebrities
rakul preet singh
rana daggubati
ravi teja
other celebrities