అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పుష్ప పాన్ ఇండియా ఫిలిం తెరకెక్కుతుంది. నిన్నమొన్నటివరకు కరోనా సెకండ్ వేవ్, సుకుమార్ డెంగ్యూ ఫీవర్ బారిన పడడంతో.. షూటింగ్ అటు ఇటుగా జరిగినా.. ప్రస్తుతం అల్లు అర్జున్ - విలన్ ఫహద్ ఫాజిల్ మధ్యన యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లోనే ప్రస్తుతం పుష్ప షూటింగ్ చిత్రీకరణలో యూనిట్ మొత్తం బిజీగా ఉంది. ఇక ఆగష్టు 13 న పుష్ప నుండి దాక్కో మేక అంటూ ఫస్ట్ సింగిల్ ని వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇప్పటికి ఆ సాంగ్ యూట్యూబ్ లో హడావిడి చేస్తూ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
ఇక క్రిష్ట్మస్ కి విడుదల కాబోతున్న పుష్ప మూవీ నుండి మరో సర్ ప్రైజ్ రాబోతుందని తెలుస్తుంది. వచ్చే నెల వినాయక చవితి కానుకాగా పుష్ప నుండి మరో సాంగ్ రివీల్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సాంగ్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక ల మధ్య వచ్చే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ అని తెలుస్తోంది. అయితే పుష్ప పాన్ ఇండియా సినిమాలో మొత్తం ఐదు సాంగ్స్ కి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని, అందులోను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరొక రేంజ్ లో ఉండనుందని టాక్. మరి ఫస్ట్ సింగల్ సోషల్ మీడియాలో ఇంకా హడావిడి చేస్తుండగానే.. ఇప్పుడు సెకండ్ సాంగ్ రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.