Advertisementt

జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా

Wed 25th Aug 2021 05:53 PM
cbi court,friday,ap cm,ys jagan bail  జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా
CBI court adjourns the verdict on YS Jagan bail cancellation జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా
Advertisement

ఎప్పటినుండో సీబీఐ కోర్టు లో నడుస్తున్న అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఆంధ్ర సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై కొంతకాలంగా నాంపల్లిలోని సీబీఐ కోర్టు లో వాదనలు జరుగుతున్నాయి. 

ఈ కేసులో జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తికాగా... తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. ఇక ఇప్పుడు ఎంపీ విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఈరోజు వాదనలు ముగిశాయి. అయితే ఈ రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు వెల్లడించింది. తీర్పు వెల్లడిని వచ్చే నెల 15కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

CBI court adjourns the verdict on YS Jagan bail cancellation:

The CBI court on Friday heard the petition over the cancellation of YS Jagan bail in Disproportionate Assets cases has adjourned

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement