ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో వెర్సటాలిటీని కనబరుస్తూ, వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రతి జనరేషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలతో అలరిస్తున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సోగ్గాడే చిన్నినాయన... మన కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్ మూవీ. ఈ సినిమాకి సీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగార్జున పెద్ద కొడుకు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కీ ఎంతో ప్రత్యేకమైన ఆల్ టైమ్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్ మూవీ మనంలో ఈ తండ్రీ కొడుకులు ఇంతకు ముందు కలిసి నటించారు.
సోగ్గాడే చిన్నినాయనా మూవీలో నాగార్జున పక్కన గ్రేస్‌ఫుల్‌గా కనిపించిన రమ్యకృష్ణ ఇప్పుడు బంగార్రాజులోనూ నటిస్తున్నారు. కుర్రకారు మనసు దోచుకున్న బెంగుళూరు భామ కృతి శెట్టిని నాగచైతన్య పక్కన ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ క్రేజీయస్ట్ మల్టీస్టారర్ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా యువరాజ్ పనిచేస్తున్నారు.
రొమాన్స్, ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అత్యద్భుతమైన కలయికగా బంగార్రాజు హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జీ స్టూడియోస్ సహ నిర్మిస్తోంది.