బండ్ల గణేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అని వేరే చెప్పక్కర్లేదు. పవన్ గురించి గంటలు గంటలు మాట్లాడే బండ్ల గణేష్.. పవన్ ని దేవుడిలా కొలుస్తారు. అయితే తాజాగా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తన ప్రాణాలు నిలబెట్టారంటూ సంచనల వ్యాఖ్యలు చేసాడు. తనకి కరోనా వచ్చినప్పుడు చిరంజీవి తనకి ప్రాణం పోస్ట్.. పవన్ కళ్యాణ్ మరో విధంగా తనకి జీవితాన్ని ఇచ్చాడు అంటూ సంచలనంగా మాట్లాడాడు. తనకి కరోనా వచ్చినప్పుడు, తన ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పుడు చాలా భయపడ్డాను అని.. ఒక్క రోజు ఆలస్యమైనా తన ప్రాణాలు పోయేవాని.. ఆ సమయంలో మెగాస్టార్ తనకి హెల్ప్ చేసాడని అన్నాడు బండ్ల.
తనకి కరోనా వచ్చినప్పుడు పవన్ కి ఫోన్ చేద్దామనుకున్నాను అని, కానీ పవన్ కూడా కరొనతో బాధపడుతున్నారని తెలిసి.. చాలా భయపడ్డాను అని, నాకు కరోనా వచ్చిన టైం లో పెద్ద వాళ్ళు హెల్ప్ చేసిన బెడ్స్ దొరకని పరిస్థితి అని, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేయగానే .. ఆయన వెంటనే ఒక్క ఫోన్ కాల్ తో నాకు సహాయం చేశారు. దాదాపు కరోనా తీవ్రస్థాయిలో విషమించింది. ప్రాణాలు పోటీయే పరిస్థితుల్లో మెగాస్టార్ దేవుడిలా వచ్చి ప్రాణాలు కాపాడారు. ఆ ప్రాణాలు నిలబడబట్లే నేను మీ ముందు ఇప్పుడు ఇలా నిలబడగలిగాను, పవన్ కళ్యాణ్ ఓ విధంగా నా జీవితం నిలబెడితే.. చిరు నా ప్రాణాలను నిలబెట్టారు అంటూ మెగా బ్రదర్స్ ని పొగిడేసాడు.