Advertisementt

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏమైపోయింది

Tue 24th Aug 2021 06:00 PM
most eligible bachelor,akhil akkineni,pooja hegde - akhil combo,most eligible bachelor releasing during dasara  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏమైపోయింది
What happened to the Most Eligible Bachelor మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏమైపోయింది
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని - పూజ హెగ్డే కాంబోలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ ముచ్చట్లేవి సోషల్ మీడియాలో వినిపించడం లేదు, కనిపించడం లేదు. అఖిల్ మాత్రం తన నెక్స్ట్ మూవీ ఏజెంట్ షూటింగ్ లో జోరుగా పాల్గొంటున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యచులర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందా? లేదా? అనేది కూడా క్లారిటీ లేదు. మొన్నామధ్యన పూజ హెగ్డే హైదరాబాద్ కి రావడంతో.. ఇంకా షూటింగ్ అవ్వలేదు అనుకున్నారు. 

మరోపక్క మోస్ట్ బ్యాచులర్ ప్రమోషన్స్ లేవు. అఖిల్ ని ఆ సినిమాని అల్లు అరవింద్ చేతిలో పెట్టి నాగ్ కూడా సైలెంట్ అయ్యాడు. అఖిల్ సినిమాని అల్లు అరవింద్ కి అప్పగించెసి నాగార్జున కూల్ గా తన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. అసలు అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేస్తున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యచులర్ ఈ ఏడాది ఉంటుందా? లేదా? అనేది అక్కినేని ఫాన్స్ కి క్లారిటీ లేక విలవిల్లాడుతున్నారు. చైతు లవ్ స్టోరీ సెప్టెంబర్ 10 న వచ్చేస్తుంది. కానీ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ జాడ కనిపించడం లేదు. 

What happened to the Most Eligible Bachelor:

Most Eligible Bachelor releasing during Dasara?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ