రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా అక్టోబర్ 13 వస్తుందా? రాదా? అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. రాజమౌళి మాత్రం పక్కాగా అక్టోబర్ 13 నే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అంటున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ లో 66 హైలెట్స్ ఉన్నప్పటికీ.. ఇప్పడు బయట చక్కర్లు కొడుతున్న న్యూస్ చూస్తే ఆర్.ఆర్.ఆర్ క్రేజీ హైలెట్ ఇదే అంటారు. కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి గా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో అన్ని యాక్షన్ సీన్స్ హైలెట్ అనేలా ఉంటాయట. అందులో రామ్ చరణ్ - ఎన్టీఆర్ యుద్ధ సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉండబోతున్నాయట.
ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సన్నివేశాల గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు వంద మంది బ్రిటిషర్లతో ఒకేసారిగా పోరాడటానికి సిద్దమవడం, ఆ తర్వాత బ్రిటిషర్ల ఊచకోత లాంటి సీన్స్ ఆర్.ఆర్.ఆర్ లో ఏ ఒక్కరూ ఊహించని రేంజ్‌లో రాజమౌళి తెరకెక్కించారని, అవే సినిమాకి మెయిన్ హైలెట్ అంటూ ప్రచారం మొదలైంది. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో ఉన్న ప్రతి సీన్ ని ప్రేక్షకుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.