డీజే దువ్వాడ జగన్నాధం సినిమాలో పూజ హెగ్డే గ్లామర్ లుక్స్, ఆమె బికినీ షో, అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ అన్ని సినిమాకి హిట్ ఇచ్చాయి. ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల మూవీస్ లో నటిస్తూ అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురములో అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలోనూ పూజ హెగ్డే గ్లామర్ ని త్రివిక్రమ్ బాగా హైలెట్ చేసాడు. తాజాగా త్రివిక్రమ్ మహేష్ కి జోడిగా మరోసారి పూజ హెగ్డేనే రిపీట్ చెయ్యబోతున్నాడు.
ఇక తాజాగా అల్లు అర్జున్ తో హ్యటిక్ కొట్టేందుకు పూజ హెగ్డే రెడీ అవుతుంది అనే న్యూస్ మొదలైంది. అది కూడా అల్లు అర్జున్ - వేణు శ్రీరామ్ కాంబోలో మొదలు కాబోతున్న ఐకాన్ మూవీ లో అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే నటించబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అసలు అల్లు అర్జున్ ఐకాన్ సినిమా అనౌన్స్ చేసినపుడు హీరోయిన్ గా పూజా హెగ్డే పేరును పరిశీలించారు. తాజాగా పూజా హెగ్డేనే అల్లు అర్జున్ కి జోడిగా ఈ సినిమాలో కన్ఫమ్ చేసినట్టు సమాచారం. అది నిజమైతే పూజ - అల్లు అర్జున్ ఈసారి పక్కాగా హ్యటిక్ కొట్టడం ఖాయమంటున్నారు అల్లు ఫాన్స్.