కార్తీక దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో బుల్లితెర ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. మోనిత హత్యనేరంతో కార్తీక్ జైలు పాలవడం, కార్తీక్ ని కాపాడడానికి దీప డ్రైవర్ అంజి, దుర్గ సహాయం తీసుకోవడంతో.. వాళ్ళు మోనిత ని వెతికే పనిలో ఉండగా.. మోనిత దీపని చంపడానికి గుడికి వెళుతుంది. దీప కార్తీక్ కోసం పూజ చేసి.. తర్వాత సోది అమ్మాయి వేషంలో ఉన్న మోనిత దగ్గరకి సోది చెప్పించుకోవడానికి వెళుతుంది. దీపకి సోది చెప్పే అమ్మాయి మోనిత అని అనిపిస్తుంది. నీకు గండాలు తప్పవు అంటూ మోనిత దీపని భయపెట్టగా.. మోనిత తుమ్మి ఎక్సాక్యూస్ మీ అనగానే అది మోనిత అని దీప అనుకుంటుండగా.. అక్కడికి దుర్గ వస్తాడు. ఇక్కడికి దుర్గ ఎందుకు వచ్చాడు.. నేను దొరికితే కష్టం అని మోనిత అక్కడి నుండి జంప్ అవుతుంది. దానితో మోనితని మేము వెతుకుతామ్ మీరు ఇంటికి వెళ్ళమని పంపిస్తారు అంజి, దుర్గ.
ఇక దీప ఇంటికి వెళ్లి అత్తమామలకు శోదమ్మ వేషంలో ఉన్న మోనిత, గుడిలో జరిగిన విషయం చెప్పగా.. మోనిత చనిపోతే.. దీప ఎందుకు ఇలా చెబుతుంది అంటూ దీపని ఎగా దిగా చూస్తారు. నువ్వు భ్రమలో ఉన్నావంటారు. లేదంటే మోనిత సోది చెప్పే అమ్మాయిగా ఎందుకు వస్తుంది అని అంటారు. ఇక దీపకి కూడా తనపై తనకి అనుమానం వస్తుంది. భర్త కార్తీక్ దగ్గరికి వెళ్లి.. మోనిత విషయం చెబుతుంది. కార్తీక్ కూడా నమ్మడు. అదే టైం లో మోనిత టి అంటూ టీ అమ్మేదానిలా కార్తీక్ టి ఇస్తుంది. దానితో కార్తీక్ మోనిత స్పర్శ గుర్తుపడతారు. మోనిత బ్రతికే ఉంది అని కార్తీక్ కూడా నమ్మే ఎపిసోడ్ ఈరోజు స్టార్ మా లో రాత్రి 7.30 కి ప్రసారం కాబోతుంది.