స్టార్ మా లో ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ లో మొదలవుతున్న బిగ్ బాస్ కి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. విలేజెస్ లో బిగ్ బాస్ ని ఆరాధించే బుల్లితెర ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఇప్పుడు జెమినీ ఛానల్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదలైంది. మరి ఎన్టీఆర్ హోస్ట్ అంటే అందరిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈ షో మాత్రం పల్లెటూరి బుల్లితెర ప్రేక్షకులకు ఎక్కడం అనేది కాస్త డౌట్ అంటున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్ భీబత్సంగా చూస్తారు. కానీ సీరియల్స్ కి అలవాటు పడిపోయి, అలాగే ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడిపోయిన వారు ఈ షో ని వీక్షించడం కలే.
బిగ్ బాస్ అంత ఆదరణ ఎవరు మీలో కోటీశ్వరులకు పల్లెటూర్లలో ఉండకపోవచ్చు అని, ఎన్టీఆర్ హోస్ట్ అయినంత మాత్రాన ఈ షోకి క్రేజ్ పెరుగుతుంది అంటే కష్టమే. నాగార్జున హోస్టింగ్, హౌస్ లో జరిగే గిల్లికజ్జాలు, గ్లామర్, లవ్ ట్రాక్స్ అంటూ బిగ్ బాస్ కి ఉన్న ఆదరణ ఎవరు మీలో కోటీశ్వరులికి రావడం కూసింత అనుమానమే సుమీ.. మరి కర్టెన్ రైజెర్ గా రామ్ చరణ్ పాల్గొన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఎపిసోడ్ టిఆర్పి వస్తే కానీ చెప్పలేం.. అంటున్నారు నెటిజెన్స్. అంటే దీన్ని బట్టి బిగ్ బాస్ మొదలైతే.. ఎవరు మీలో కోటీశ్వరులకు ఇబ్బందే.