మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో భాగంగా మెగా హీరోలంతా కలిసి చిరు ఇంట్లోనే ఆయన పుట్టిన రోజు వేడుకలని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ రక్షా బంధనం వేడుకలని గ్రాండ్ గా నిర్వహించింది. మరోపక్క సోషల్ మీడియాలో చిరు మూవీస్ అప్ డేట్స్ తో ఫాన్స్ హంగామా చేసారు. అయితే మెగాస్టార్ చిరు బర్త్ డే వేడుకల్లో కానీ.. రాఖి పౌర్ణమి వేడుకల్లో కానీ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. అల్లు అర్జున్ కానీ, శిరీష్ కానీ, అరవింద్ కానీ కనిపించలేదు.
ఆఖరికి అల్లు అరవింద్ సురేఖ తో రాఖి కట్టించుకున్న పిక్ కూడా బయటికి రాలేదు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా మెగాస్టార్ చిరు ఇంటికి వెళ్లి అన్నకి శుభాకాంక్షలు చెప్పడమే కాదు... అక్కలతో రాఖి కట్టించుకుని మెగా ఫ్యామిలి తో సందడి చేసాడు. ఇక మెగా హీరోలైన చిరు - నాగబాబు - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ ఆఖరికి వైష్ణవ్ తేజ్ కలిసి దిగిన మెగా పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అందులో అల్లు అర్జున్ లేకపోవడం మెగా ఫాన్స్ లోటుగా ఫీలవుతున్నారు.
అయితే అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. సో అల్లు అర్జున్ ఇక్కడే ఉండి ఉండాలి. ఇక అల్లు శిరీష్, అల్లు అరవింద్ కానీ ఎవరూ చిరు మెగా బర్త్ డే వేడుకల్లో మాత్రం కనిపించలేదు. అందుకే అసలు విషయం ఏమిటా అని అందరూ ఇప్పుడు ఆరాలు మొదలు పెట్టారు.