ఎప్పుడు గ్లామర్ పాత్రలతో దూసుకుపోయే రకుల్ ప్రీత్.. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బాగా బిజీ. స్లిమ్ లుక్ కోసం జిమ్ లో కష్టపడే రకుల్.. ప్రస్తుతం సైజు జీరో లుక్ లో హడావిడి చేస్తుంది. బాలీవుడ్ కి వెళ్ళాక మ్యాగజైన్ కవర్ పేజెస్ మీద సందడికి చేస్తున్న రకుల్ ప్రీత్ కెరీర్ లో ఫస్ట్ టైం డీ గ్లామర్ గా నటించిన కొండ పొలం లుక్ ని రివీల్ చేసింది టీం.
మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ కొండపొలం. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రకుల్ ఈ చిత్రంలో ఓబులమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా నటించింది.
రకుల్ లుక్‌ను రివీల్ చేస్తూ కొండపొలం చిత్రం నుంచి ఓ సాంగ్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అడవిలో రకుల్ ప్రీత్ సింగ్‌ను ప్రేమతో, వెనుక నుంచి వైష్ణవ్ కౌగించుకునే సన్నివేశం గ్లింప్స్‌లో కనిపిస్తుంది. వైష్ణవ్, రకుల్ జోడి స్క్రీన్‌పై ఓ ఫ్రెష్ ఫీల్‌నిస్తుంది. హాఫ్ శారీలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ చక్కటి పాత్ర చేసిందని అర్థమవుతుంది.