ఈ రోజు నుండి జెమినీ ఛానల్ లో రాత్రి 8.30 నిమిషాలకు మొదలు కాబోతున్న ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు గత రాత్రి కర్టేన్రైజెర్ ఈవెంట్ లో రామరాజు అదేనండి ఆర్.ఆర్.ఆర్ హీరో రామ్ చరణ్ గెస్ట్ గా పాల్గొన్నాడు. కొమరం భీం ఎన్టీఆర్ హోస్ట్ గా రామ్ చరణ్ గెస్ట్ గా అదిరింది ఈ ఎపిసోడ్. రామ్ - భీం ఇద్దరూ కోటు, సూటు తో అదరగొట్టేసారు. రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీ సమాధానాలు కి బుల్లితెర ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసారు.
ఇక రామ్ చరణ్ తనకు బోర్ అనిపించినప్పుడు ఎన్టీఆర్ నటించిన అదుర్స్ మూవీ సీన్స్ చూస్తుంటా అని చెప్పిన రాంచరణ్ తన మగధీర ముచ్చట్లు తన దగ్గర ఉన్న గుర్రాలలో ఒక దాని బాద్‌షా అని చెప్పారు. మగధీరలో నేను రైడ్ చేసిన గుర్రం అదే అని చెప్పారు. మరోవైపు ఓ స్నేహితుడు అతను చనిపోయే ముందు తనకు మరో గుర్రాన్ని ఇచ్చాడు. దానికి కాజల్ అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చారు. మగధీర షూటింగ్ అప్పుడు గుర్రం పేరు కాజల్ పేరు ఒకటే కావడంతో అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందంటూ నవ్వులు పూయించారు రామ్ చరణ్.
ఇక ఎన్టీఆర్ కొమరం భీం గా ఆర్.ఆర్.ఆర్ లో అదరగెట్టేసాడని రామ్ చరణ్ చెబితే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా అదరగొట్టేసాడంటూ ఎన్టీఆర్ చెప్పడంతో ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఆర్.ఆర్.ఆర్ ఖచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయమంటూ ఆర్.ఆర్.ఆర్ హీరోలు ఎవరు మీలో కోటీశ్వరులు షో లో చెప్పడం హైలెట్ అయ్యింది.